
రేషనలైజేషన్‌తో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు తీవ్ర అన్యా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్‌లో వీఆర్వో, సర్వేయర్లకు తీవ్ర అన్యాయం జరగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్‌లతో ప్రమేయం లేకుండా జీఎస్‌డబ్ల్యూఎస్ జీవో 4ను జారీ చేయడం దారుణమన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ నందు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వో, వీఎస్‌లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో జీఎస్‌డబ్ల్యూఎస్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన రెండు, మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి సచివాలయానికో వీఆర్వో, వీఎస్‌ను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ విధానంలో 7,500 మంది వీఆర్వోలు, 4,722 మంది వీఎస్‌లను తగ్గించి చూపారన్నారు. దీని వలన ఉద్యోగోన్నతులకు అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. క్లస్టర్ విధానంలో జరుగుతున్న లోపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెవెన్యూలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐలుగా ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న గ్రేడ్ –2 వీఆర్వోలను గ్రేడ్–1, వీఆర్వోలుగా వన్ టైమ్ సెటిల్మెంట్‌గా ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్‌కు ఒక వీఆర్వోను కొనసాగించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, రాష్ట్ర కోశాధికారి మౌళి బాషా, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యకులు లక్ష్మీనారాయణ, ప్రసన్న కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.