
ఎన్టీటీపీఎస్‌లో మాక్‌డ్రిల్
ఇబ్రహీంపట్నం: యుద్ధ వాతావరణం, ఉగ్ర ముప్పు నుంచి ఉద్యోగులు ఎలా రక్షణ పొందాలనే అంశంపై ఎస్పీఎఫ్ సిబ్బంది ఎన్టీటీపీఎస్‌లో మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ముఖ్యఅతిథి ఆర్డీఓ కావూరి చైతన్య మాట్లాడుతూ అనుకోని విపత్తలు ఎదురైనప్పుడు ఉద్యోగులు తమకు తాము రక్షించునే పద్ధతులు తెలియజేయడమే మాక్‌డ్రిల్ ఉద్దేశమన్నారు. అగ్నిప్రమాదం, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవల్సిన రక్షణ చర్యలు, ఎదుటివారు సమస్యల్లో చిక్కుకుంటే ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఉపద్రవాల సమయంలో స్పందించాల్సిన తీరుపై అగ్నిమాపక శాఖ, పోలీస్, మెడికల్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాక్‌డ్రిల్ ద్వారా చూపించారు. ఏసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ రాజు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఈ శివరామాంజనేయులు, పోలీస్, ఫైర్, మెడికల్, తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీటీపీఎస్‌లో మాక్‌డ్రిల్