పసుపు–కుంకుమ ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

పసుపు–కుంకుమ ఉత్సవం

Published Tue, Mar 18 2025 10:00 PM | Last Updated on Tue, Mar 18 2025 10:01 PM

కనుల పండువగా పుట్టింటి

అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మ వారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకువచ్చే కార్యక్రమం సోమవారం రాత్రి కనుల పండువగా సాగింది. అమ్మవారి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగురంగుల విద్యుత్‌ దీపాలలు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి పసుపు – కుంకుమ బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. అర్ధరాత్రి 12 గంటల తరువాత పసుపు – కుంకుమ బండ్లు పెనుగంచిప్రోలులోని అమ్మ వారి ఆలయానికి చేరాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.కిషోర్‌కుమార్‌, ఈఈ ఎల్‌.రమ, డీసీపీ మహేశ్వరరాజు, నందిగామ ఏసీపీ తిలక్‌, ఎంపీటీసీ సభ్యురాలు పొందూరు విజయలక్ష్మి, తహసీల్దార్‌ ఎ.శాంతిలక్ష్మి, ఏఈ రాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పసుపు–కుంకుమ ఉత్సవం 1
1/2

పసుపు–కుంకుమ ఉత్సవం

పసుపు–కుంకుమ ఉత్సవం 2
2/2

పసుపు–కుంకుమ ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement