ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని పలువురు అధికారులు, సిబ్బందికి రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు బదిలీ చేస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. దుర్గగుడి ఏఈవో ఎన్. రమేష్‌బాబు, సూపరిండెంటెంట్ లక్ష్మీ ప్రసన్నను సింహచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ పి. శిరీష అన్నవరం దేవస్థానానికి బదిలీ కాగా, జె. కామేశ్వరి ద్వారకా తిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. జూనియర్ అసిస్టెంట్ కె. బలరామకృష్ణ, ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్ ద్వారకా తిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు.
ఇక్కడికి వస్తున్న అధికారులు..
అనంతపురం కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి ఏసీ గురుప్రసాద్ ఇంద్రకీలాద్రికి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వస్తున్నారు. అలాగే సింహచలం దేవస్థానానికి చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ సుంకర సన్యాసిరావు, ద్వారకాతిరుమల దేవస్థానానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ సీహెచ్‌వీ కోదండ రామాచార్యులు, వై.రజితా రాణి, కె. లక్ష్మీ నర్సమ్మ, కేవీబీ కాత్యాయని దుర్గగుడికి బదిలీపై వస్తున్నారు.