సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్ | Telangana Balagam Alai Balai under Telangana Cultural Society Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్

Jun 4 2023 5:34 PM | Updated on Jun 4 2023 5:35 PM

Telangana Balagam Alai Balai under Telangana Cultural Society Singapore - Sakshi

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను తెలంగాణ బలగం అలయ్ బలయ్ -2023 పేరిట  ఇక్కడి సింగపూర్ పుంగ్గోల్ పార్క్ లో ఆదివారం (జూన్ 4) ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 400 మంది ప్రవాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, ఆటలను  భావి తరాలకు అందించడానికి TCSS సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, అష్టాచెమ్మ, పచ్చీస్, కచ్చకాయలు, గోళీలాట, తొక్కుడు బిళ్ళ, చార్ పల్లి, కోకో, చిర్రగోనే  వంటివి ఆడించి బహుమతులు అందజేశారు. ఈ అలయ్ బలయ్ లో సర్వపిండి, పచ్చి పులుసు, చల్ల చారు, బాగారా  మొదలగు నోరూరించే తెలంగాణ వంటకాలను అందరికి రుచి చూపించారు.

తెలంగాణ బలగం అలయ్ బలయ్ విజయవంతంగా జరగడానికి సహకరించి ఈ  కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ  ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, గోనె  నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి  వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, సదానందం అందె, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, రాధికా రెడ్డి నల్ల, కల్వ లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్ కొక్కుల వ్యవహరించారు. కార్యక్రమంలో నాగ భూషణ్ రెడ్డి, రమాదేవి మల్లారెడ్డి, సందీప్. ఎమ్,  ముశ్రమ్ మహేష్ తదితరులు తమ ఇంటి రుచులను అందరికీ రుచి చూపించారు. కార్యక్రమ స్పాన్సర్స్ ఏపిజే అభిరామీ జువెల్లర్స్, మై హోమ్ సయుక్, జోయాలుకాస్, ఎస్‌పీసిస్ నెట్, వైష్ణవి ఇన్ ఫ్, గరంటో ఎకాడమి వారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement