breaking news
family day
-
సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను తెలంగాణ బలగం అలయ్ బలయ్ -2023 పేరిట ఇక్కడి సింగపూర్ పుంగ్గోల్ పార్క్ లో ఆదివారం (జూన్ 4) ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 400 మంది ప్రవాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, ఆటలను భావి తరాలకు అందించడానికి TCSS సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, అష్టాచెమ్మ, పచ్చీస్, కచ్చకాయలు, గోళీలాట, తొక్కుడు బిళ్ళ, చార్ పల్లి, కోకో, చిర్రగోనే వంటివి ఆడించి బహుమతులు అందజేశారు. ఈ అలయ్ బలయ్ లో సర్వపిండి, పచ్చి పులుసు, చల్ల చారు, బాగారా మొదలగు నోరూరించే తెలంగాణ వంటకాలను అందరికి రుచి చూపించారు. తెలంగాణ బలగం అలయ్ బలయ్ విజయవంతంగా జరగడానికి సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, రాధికా రెడ్డి నల్ల, కల్వ లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్ కొక్కుల వ్యవహరించారు. కార్యక్రమంలో నాగ భూషణ్ రెడ్డి, రమాదేవి మల్లారెడ్డి, సందీప్. ఎమ్, ముశ్రమ్ మహేష్ తదితరులు తమ ఇంటి రుచులను అందరికీ రుచి చూపించారు. కార్యక్రమ స్పాన్సర్స్ ఏపిజే అభిరామీ జువెల్లర్స్, మై హోమ్ సయుక్, జోయాలుకాస్, ఎస్పీసిస్ నెట్, వైష్ణవి ఇన్ ఫ్, గరంటో ఎకాడమి వారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అభిమానులతో సరదాగా...
మెల్బోర్న్: మూడో టెస్టు సన్నాహాల్లో ఉన్న భారత క్రికెటర్లు మంగళవారం ఇక్కడి అభిమానులతో సరదాగా గడిపారు. ఎంసీజీ బయట ‘ఫ్యామిలీ డే’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి జట్టు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ముఖ్యంగా భద్రతాపరమైన కట్టుబాట్లు లేకుండా వారంతా అభిమానులకు బాగా దగ్గరగా రావడం విశేషం. కెప్టెన్ ధోనితో సహా ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలు కూడా దిగారు. అత్యుత్సాహంతో అభిమానులు ‘సెల్ఫీ’ కోసం అడిగినా... భారత ఆటగాళ్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వీరిలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆటతో సంబంధం లేని అనేక ఆసక్తికర అంశాలపై ఆటగాళ్లు ప్రశాంతంగా, మనసు విప్పి మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాకు మేం ఎప్పుడు వచ్చినా మాకు మంచి మద్దతు లభిస్తుంది. బాగా ఆడితే ఆసీస్ స్థానికులు కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. మూడో టెస్టులోనూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం’ అని కోహ్లి, రోహిత్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో భారతీయ వంటకాలైన భేల్ పూరి, ఆలూ చాట్, పావ్‌భాజీ, కుల్ఫీవంటివి అమ్మకానికి ఉంచారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంసీజీ నెట్స్‌లో టీమిండియా ప్రాక్టీస్‌ను కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తిలకించారు.