మన చాయ్‌ పానీ ముందు..పిజ్జా, బర్గర్‌లు జుజుబీ అనాల్సిందే!

Chai Pani Declared Best Restaurant In Us - Sakshi

సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్‌ నిదర్శనం. అలాంటి మన దేశ రుచులు ఎల్లలు దాటుతున్నాయి. పిజ్జాలు, బర్గర్‌లు తినే అమెరికన్‌లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు. తమ దేశంలోనూ స్ట్రీట్‌ ఫుడ్‌లను అందించడంలో భారత్‌ రెస్టారెంట్‌లే బాగున్నాయంటూ  కొనియాడుతున్నారు.

మెహెర్‌ వాన్‌ ఇరానీ భారతీయ వంటకాలన్నీ అమెరికన్‌లకు రుచి చూపించేందుకు 2009లో అమెరికా నార్త్‌ కరోలినా యాష్‌లో 'చాయ్‌ పానీ' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కేవలం 8 డాలర్ల నుంచి 17డాలర్ల మధ్య ధరలతో చాట్‌ను అందించడంతో ఆ రెస్టారెంట్‌కు భారత్‌, అమెరికన్‌లకే కాదు వివిధ దేశాలకు చెందిన ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంది.

ముఖ్యంగా మనదేశంలో విరివిరిగా లభ్యమయ్యే మసాలల్ని దట్టించిన చాట్‌లలో షడ్రుచులు తోడవవ్వడం అమెరికాలో 1946 నుంచి సంప్రాదాయ వంటకాల్ని అందించే బ్రెన్నాన్స్‌ వంటి హోటల్స్‌ ను చాయ్‌ పానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 

ధర తక్కువ, రుచికరమైన వంటకాల్ని అందించడంతో చాయ్‌ పానీ ఫుడ్‌ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో 40 ఏళ్లలో ఎన్నుడూ చెల్లించిన విధంగా అమెరికన్‌లు ఆహరం కోసం ఈ ఏడాది అత్యధికంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో రీజనబుల్‌ ప్రైస్‌లో చాయ్‌ పానీ వంటకాలు లభ్యం కావడంతో అమెరికాలో బెస్ట్‌ రెస్టారెంట్‌గా ప్రసిద్దికెక్కింది. జేమ్స్‌ బియర్డ్‌ ఫౌండేషన్‌ అవార్డ్స్‌ సొంతం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది.

చదవండి👉పెట్రోల్‌పై డిస్కౌంట్‌! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top