విషాదం: ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్‌.. పండ్ల తోటలో మృతదేహాలు లభ్యం!

California Kidnapped Indian Origin Family Found Dead - Sakshi

కాలిఫోర్నియా: యూఎస్‌లో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్‌ ఉదంతం.. విషాదంగా ముగిసింది. ఎనిమిది నెలల పసికందుతో సహా అంతా మృతదేహాలుగా కనిపించారని కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు.  ఓ పండ్ల తోట నుంచి వీళ్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మృతుల్ని జస్లీన్‌ కౌర్‌(27), జస్దీప్‌ సింగ్‌(36).. వీళ్ల ఎనిమిది నెలల పాప అరూహీ ధేరి, బంధువు అమన్‌దీప్‌ సింగ్‌(39)గా గుర్తించారు. సోమవారం నార్త్‌ కాలిఫోర్నియాలోని మెర్స్‌డ్‌ కౌంటీ నుంచి వీళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీళ్ల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఇంతలో..   

బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్‌& హచిన్‌సన్‌ రోడ్‌లోని ఓ పండ్ల తోటలో పని చేసే వ్యక్తి.. వీళ్ల మృతదేహాలను గుర్తించి తమకు సమాచారం అందించాడని మెర్స్‌డ్‌ కౌంటీ పోలీస్‌ అధికారి వెర్న్‌ వార్న్‌కె తెలిపారు. ఆ సమయంలో ఆ అధికారి భావోద్వేగానికి లోనయ్యారు. నిందితుడికి నరకమే సరైన శిక్ష అని అభిప్రాయపడ్డారాయన.

ఇదిలా ఉంటే.. జస్దీప్‌ తన కుటుంబంతో సెంట్రల్‌ వ్యాలీలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్‌ 3వ తేదీన సౌత్‌హైవే 59లోని 800 బ్లాక్‌ వద్ద కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి వీళ్లను అపహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబం కిడ్నాప్‌కు గురైన మరుసటి రోజే.. అనుమానితుడు మాన్యుయెల్‌ సల్గాడోను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జస్దీప్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ రణ్‌దీర్‌ సింగ్‌, కృపాల్‌ కౌర్‌ల స్వస్థలం పంజాబ్‌.

కిడ్నాప్‌ ఉద్దేశం కచ్చితంగా తెలియదని, కిడ్నాపర్‌ తాను దొరకకుండా సాక్ష్యాలు, ఆధారాలను నాశనం చేశాడని పోలీస్‌ అధికారులు తెలిపారు. నిందితుడి విచారణలో కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: పిల్లల దగ్గు, జలుబు సిరప్‌లో కలుషితాలు!

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top