సేంద్రియ విధానంతో ప్రజారోగ్యం | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ విధానంతో ప్రజారోగ్యం

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రైతులు పంటల మార్పిడి విధానం పాటిస్తూ, విచ్చలవిడిగా క్రి మిసంహారక మందుల వాడకాన్ని నిలిపేయడం ద్వారా ప్రజారోగ్యం కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధ్యక్షతన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశం జరిగింది. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్లలో జరిగిన ప్రగతి, చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ, పాలనలో వారిని భాగస్వాములు చే యాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.

గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రా ష్ట్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో అన్నివర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, ప్రజలను భాగస్వాము లు చేసి సమష్టిగా కృషి చేస్తేనే ప్రగతి సాధ్యమన్నారు. రైతులు క్రిమిసంహారక మందులు వాడకపోతే క్యాన్సర్‌ లాంటి వ్యాధులు రాకుండా ప్రజారోగ్యం కాపాడినట్లేనన్నారు. పామాయిల్‌ సాగుతో రైతులకు 30 ఏళ్ల పాటు ఆర్థికంగా మేలు కలుగుతుందన్నారు.

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రత్యేకించి మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సమర్థవంతంగా పని చేస్తూ తమకు లభించిన అవకాశంతో చక్కటి సేవలు అందించాలన్నారు. కుటుంబ సభ్యుల జోక్యానికి తావులేకుండా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తామన్నారు.

కార్యక్రమంలో మేయర్‌ ఉమారాణి, డిప్యూటీ మేయర్‌ సల్మా తహసీన్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ రాష్ట్ర గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కవితారెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్‌, దిలీప్‌ కుమార్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఆర్‌వో గీత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి మాట్లాడుతూ అధి కారుల కృషితో ఏడు లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, త్వరలోనే రెండోవిడత ఇళ్లు మంజూరు అవుతాయన్నారు. నిబంధనలను సడలించనున్నట్లు తెలిపారు. గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. తాను సభ్యడిగా ఉన్నానని, గల్ఫ్‌ కార్మికుల సమస్యలపై సర్పంచ్‌లు, మండల అధికారులు పూర్తిస్థాయిలో గైడ్‌ చేయాలని కోరారు.

ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కృషి చేయడంలేదన్నారు. నగరంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి తప్ప పూర్తి కావడం లేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ కావడం లేదన్నారు. నగరం చుట్టూ రింగురోడ్డు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఇవ్వలేదన్నారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం నగరాలకు రింగురోడ్లు మంజూరు చేశారన్నారు. నగరంలో బస్‌స్టేషన్‌ కొత్తది నిర్మించాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, కళాభవన్‌, సుందరీకరణ పనులు ముందుకు కదలడంలేదన్నారు.

రైతులు పంటల మార్పిడి పాటించాలి..

క్రిమిసంహారక మందులు వాడొద్దు

ప్రభుత్వ సలహాదారు పోచారం

శ్రీనివాస్‌రెడ్డి

కలెక్టరేట్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement