● ఎండల ప్రభావం ఎవరిపై ఎక్కువ
● ఎండల ప్రభావం మధుమేహం, రక్తపో టు, కిడ్నీ వ్యాధిగ్రస్తు లు, వృద్ధులు, గర్భి ణులు, చిన్నారులు, సిగరేట్, అల్కాహాల్ సేవించేవారిపై ఎక్కువగా ఉంటుంది. వీరు ఎండలో ఎక్కువసేపు ఉండొద్దు. తలుపులు మూసేసి ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నారులు సైతం వేడి ప్రభావంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు వడగాలుల ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
● ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
● వడగాలులకు శరీరంలోని నీరు చెమట రూపంలో ఆవిరైపోతుంది. సాధారణ రోజుల్లో కన్నా 3 లీటర్ల వరకు నీటిని అధికంగా తీసుకోవాలి. లేకుంటే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వీలైనంత ఎక్కువగా తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్, చల్లని నీటి కన్నా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, తాగితే మంచిది. పుచ్చకాయ, నిమ్మరసం, ద్రాక్షలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. రోజులో 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది.
● ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి..
● అవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, మాంసం, చికెన్ లాంటివి తీసుకోకపోవడం ఉత్తమం. జ్వరం, తలనొప్పి,ఇతర వడదెబ్బ లక్షణాలు, సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ జలగం తిరుపతిరావు
వడదెబ్బ లక్షణాలను ఎలా గుర్తించాలి?
తలనొప్పి, అధిక జ్వరం (107 డిగ్రీల టెంపరేచర్), శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం, స్పృ హ కోల్పోవడం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయిన సమయంలో శరీరంపై ఉన్న దుస్తులు తొలగించాలి. నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడిచి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో అశ్రద్ధ చేస్తే, గుండె, కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మృతి చెందే అవకాశాలుంటాయి.
పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు
ఇంట్లో ఉన్నా వడదెబ్బకు
గురయ్యే అవకాశం
జ్వరం, తలనొప్పి, డీ హైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి
‘సాక్షి’తో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. వడగాలులు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా తీసుకునే దాని కన్నా మూడు లీటర్ల వరకు నీటిని అదనంగా తీసుకోవాలి. ఎండ తీవ్రతతో తలనొప్పి, జ్వరం తదితర సమస్యలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు ప్రజలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ జలగం తిరుపతిరావుతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. – సుభాష్‌నగర్
వడగాలులు తగలకుండా ఏం చేయాలి.
బయటికి వెళ్లేటప్పుడు తలకు తెల్లని టోపీలు పెట్టుకోవాలి. కళ్లజోడుతోపాటు చెవులు, ముక్కులోకి వేడిగాలులు ప్రవేశించకుండా చేతి రుమాలి కట్టుకోవాలి. తెల్లని, కాటన్ దుస్తులు ధరించాలి. సిల్క్, నైలాన్ వంటి దుస్తులు ధరించవద్దు. సెలవుల్లో చిన్నారులు ఎక్కువగా బయట ఆడుతుంటారు. ఈ క్రమంలో నీరు తీసుకోవడంపై అశ్రద్ధ వహిస్తారు. తల్లిదండ్రులు గమనించి తరచూ నీటిని తాగించాలి. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇండోర్ గేమ్స్ ఆడించాలి. పెద్దలు సైతం అవసరమైతే తప్ప బయటికి రావొద్దు.


