ఎస్‌ఐఆర్‌తో ఓట్లు పోకుండా కాపాడుతాం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌తో ఓట్లు పోకుండా కాపాడుతాం

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)కు సంబంధించి అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ నేపథ్యంలో పార్టీ తరఫున నియమించిన బూత్‌ లెవ ల్‌ ఏజెంట్ల సహకారంతో ప్రతి ఒక్కరి ఓటు హ క్కు ను కాపాడుతామన్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి ఓటు హక్కును కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. ఇప్పటికే వందలమంది ఎన్‌ఆర్‌ ఐలు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చా రు. దీంతో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలుస్తా మని కేటీఆర్‌ తెలిపారు. పార్టీ తరఫున ఒక సీనియ ర్‌ ప్రతినిధి, నాయకులప్రతినిధి బృందాన్ని, ఎమ్మె ల్యేలు,ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపుతామన్నారు. పార్టీ బూత్‌ లెవెల్‌ అసిస్టెంట్లు గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐల వివరాలు సేకరించి, వారి ఓటు హక్కును తొలగించకుండా సమన్వయం చేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల ప్రజాప్రతినిధు లు, నియోజకవర్గ ఇన్‌చార్జులు ప్రత్యేక చొరవ చూ పాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్‌ ఉమ్మడి నాయకులకు వివరించారు. సభ్యత్వ నమోదు ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నాయకులంద రూ తమ నియోజకవర్గాల్లోని స్థితిగతులపై కేటీఆర్‌కు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మోసాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తిరిగి కేసీఆర్‌ రావాలని కోరుకుంటున్నారని తమ అభిప్రాయాలు తెలిపారు. సమావేశంలో కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి, వీజీ గౌడ్‌, నిజా మాబాద్‌, కామారెడ్డి జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

బూత్‌ లెవెల్‌ అసిస్టెంట్లతో గల్ఫ్‌

ఎన్‌ఆర్‌ఐల వివరాల సేకరణ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులతో సమీక్ష సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement