● శిక్షణ శిబిరాల్లో ఉల్లాసంగా
పాల్గొంటున్న విద్యార్థులు
● యోగాతోపాటు ఇండోర్,
అవుట్ డోర్ క్రీడలపై మక్కువ
● చిత్రలేఖనం, తబల, హార్మోనియంపై తర్ఫీదు
లింగంపేట(ఎల్లారెడ్డి): వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆరోగ్యం, ఆహ్లాదం సొంతం చేసుకుంటున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో 70 మంది విద్యార్థులతో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా విద్యార్థులు అన్ని రంగాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఆట పాటలు, యోగా, ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్‌పై విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. తబల, హార్మోనియం వాయించడంపై తర్ఫీదు పొందుతున్నారు. శిక్షకులు తమకు వచ్చిన కళలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కంప్యూటర్ విద్య నేర్చుకొంటే.. మరికొంత మంది డ్రాయింగ్, యోగా, వాలీబాల్ తదితర క్రీడలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రతి రోజు సమ్మర్ క్యాంపులో కొంగొత్త విషయాలు నేర్చుకొంటున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపుకు వ చ్చి కంప్యూటర్ విద్య నేర్చు కుంటున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు చక్కగా నేర్పిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు.
– బొల్లు బహుగుణ, ఏడో తరగతి
(బాలుర ఉన్నత పాఠశాల లింగంపేట)
సమ్మర్ క్యాంపులో మ్యాథ్స్‌లో మెళకువలు నేర్చుకోగలుగుతున్నాను. టేబుల్స్, పె యింటింగ్, కలర్స్ వే యడం ఆర్టిస్టు అను భూతి పొందుతున్నాను.వాలీబాల్, చదరంగం తదితర క్రీడలు నేర్చుకుంటున్నాను.
– మనోజ్ సాయి, లింగంపేట
యోగా, చిత్రలేఖనం, కంప్యూటర్,ఆటలు, పాటలు నేర్చుకుంటున్నాం. బస్సు సౌకర్యం లేకున్నా ఆటో, బైక్‌పై వచ్చి నేర్చుకుంటున్నా. సమ్మర్ క్యాంపు చాలా ఉపయోగకరంగా ఉంది. – అవంతిక, సజ్జన్‌పల్లి
(ప్రాథమికోన్నత పాఠశాల)
కొత్త రకమైన కళలు నేర్చుకోవడం సంతో షంగా ఉంది. తబల, హార్మోనియం నేర్పడానికి నిపుణులైన కళాకా రులు వస్తున్నారు. ఇ లాంటి అవకాశం రావ డం చాలా ఆనందంగా ఉంది. – రంగరి సహిష్ణు,
జీవదాన్ స్కూల్ ఎల్లారెడ్డి


