హౌస్‌వైరింగ్‌కు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హౌస్‌వైరింగ్‌కు డిమాండ్‌

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

హౌస్‌వైరింగ్‌కు డిమాండ్‌ భాగ్యరెడ్డి వర్మ జయంతి ‘ములాఖత్‌ లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌ డెస్క్‌’ బీసీ వెల్ఫేర్‌లో బదిలీలు

డిచ్‌పల్లి: హౌస్‌ వైరింగ్‌ నేర్చుకున్న నిపుణులకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) డైరెక్టర్‌ ఎం.రవికుమార్‌ తెలిపారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఈటీఐలో వారం రోజుల నుంచి నిరుద్యోగ యువతకు హౌస్‌వైరింగ్‌పై ఉచిత శిక్షణనిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం నూతన ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. హౌస్‌వైరింగ్‌కు డిమాండ్‌ ఉండటంతో నిరుద్యోగ యువత శిక్షణపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ట్రైనర్‌ రవి ఆధ్వర్యంలో నెలరోజులపాటు ఉచిత శిక్షణనిచ్చి టూల్‌ కిట్‌, ధ్రువపత్రం అందజేస్తామన్నారు.

నిజామాబాద్‌ : దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906–1933 మధ్య హైదరాబాద్‌ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి రజిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిజామాబాద్‌ లీగల్‌: జిల్లా న్యాయసేవా అధి కార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర కారాగా రంలో ‘ములాఖత్‌ లీగల్‌ ఎయిడ్‌ హెల్ప్‌డెస్క్‌’ ను డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ జి. ఉదయకృష్ణ, సబ్‌ జైలర్‌ మన్మథరావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయ కృష్ణ మాట్లాడుతూ జైలులో ఉన్న ఖైదీలను కలవడానికి వచ్చే వారి కోసం హెల్ప్‌డెస్క్‌ సహాయకరంగా ఉంటుందన్నారు. ము లాఖత్‌కు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరా స్యులు ఉంటారని, వారికి దరఖాస్తులు నింపి సహాయం చేస్తామని అన్నారు. హెల్ప్‌డెస్క్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వర కు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ మహమ్మద్‌ షాదుల్ల, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ శుభం, ప్యానల్‌ న్యాయవాదులు లక్ష్మీనారాయణ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి : బీసీ వెల్ఫేర్‌ సిబ్బందికి కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నర్సయ్య పర్యవేక్షణలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం బదిలీలు నిర్వహించారు. కుక్‌లు, కామటి నైట్‌ వాచ్‌మన్‌లు 10 మంది ఉండగా ఏడుగురికి బదిలీ జరిగినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement