ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు
సుభాష్‌నగర్ : నగరంలోని ఆర్యనగర్ ఉపకేంద్రంలో వన్ మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పనులు వీలైనంత త్వరలో ప్రారంభించాలని ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్) మోహన్‌రావు ఆదేశించారు. జిల్లా లో ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చీఫ్ ఇంజినీర్ (వరంగల్) సురేందర్‌తో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఫులాంగ్ రైతుబజార్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని వారు పరిశీలించారు. 33 కేవీ పనులు వెంటనే ప్రారంభించాలని, సివిల్ పనులు జూన్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. సోలార్ ప్లాంట్ పనులు త్వరగా ప్రారంభించాలని వెంకట్ ధీర్ ఇన్‌ఫ్రా సోలార్ ప్రతినిధి సతీశ్‌కు సూచించారు. వారి వెంట ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు, కన్‌స్ట్రక్షన్ డీఈ వెంకటరమణ, ఈఈ (సివిల్) స్వామి, ఏడీఈ తోట రాజశేఖర్, వినోద్, సాయితేజ, ఏఈలు కాశీనాథ్, బాబా శ్రీనివాస్, ఆర్ సునీత, శ్రావణ్‌కుమార్, కార్తిక్, తదితరులు ఉన్నారు.
జక్రాన్‌పల్లి సోలార్ ప్లాంట్ పరిశీలన
జక్రాన్‌పల్లి:జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని సోలా ర్ ప్లాంట్‌ను డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్(వరంగల్) మో హన్‌రావు, చీఫ్ ఇంజినీర్ ప్రొడక్ట్స్ సురేందర్ పరిశీలించారు.ప్రతివారం సోలార్ ప్యానల్స్ శుభ్రం చే యాలని ఆదేశించారు. ఆయన వెంట హరి చంద్రనాయక్, ఏఈలు భాస్కర్, ప్రవీణ్, కార్తిక్, ప్లాంట్ కాంట్రాక్టర్ ప్రతినిధి సతీశ్ తదితరులు ఉన్నారు.


