● ఫలితంపై ఆందోళన వద్దు
● మళ్లీ ప్రయత్నిస్తే అందరితోపాటు ముందుకు..
ఖలీల్‌వాడి: జీవితం.. ఎన్నో దారులు, అనుభవాలు, అవకాశాలతో కూడినది. ఏడాదంతా కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితం ఎలా వస్తుందోనని భయాందోళనకు గురికావడం సహజమే. అయితే జీవితమంటే ‘పరీక్ష’ మా త్రమే కాదు.. ఫలితాలు జీవితాన్ని నిర్ణయించలేవు. ఫెయి ల్ అయిన విద్యార్థికి మళ్లీ పరీక్ష రాసుకునే, తక్కువ మా ర్కులు వచ్చిన వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత సాధించి అందరితో కలిసి ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో మార్కులు, ర్యాంకు రాలేదని కొంత మంది, ఫెయిల్ అయ్యామని కొంత మంది విద్యార్థులు ఒ త్తిడికి గురవుతుంటారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు వారికి భరోసా కల్పించాలి. ‘పరీక్ష’ తప్పిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ జిల్లాలో గతంలో చోటు చేసుకున్నాయి. చదువు జీవితంలో భాగమే కానీ.. అదే జీవితం కాదని విషయంపై టీచర్లు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు ఆత్మస్థైర్యాన్ని నింపా లని వ్యక్తిత్వ వి కాస నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తం విద్యార్థులు 24,545..
విద్యాసంవత్సరం మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వ రకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలు జరిగాయి. జిల్లాలో రెగుల్య ర్, ప్రయివేట్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 24,545 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 24,402 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 42 మంది గైర్హాజరయ్యారు. అలాగే ప్రయివేట్ విద్యార్థులు 143 మంది పరీక్షలు రాశారు.
నిరుత్సాహం వద్దు
పదో పరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని, ఫెయిల్ అయ్యామని చాలామంది విద్యార్థులు నిరాశ చెందుతారు. భావోద్వేగాలను సమన్వయ పర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మ విశ్వాసం పెంపొందించే విషయాలు, కథలు, పలువురి అనుభవాలను వారికి వివరించాలి. పరీక్షలే జీవితానికి ముఖ్యం కాదని వారికి ఆర్థమయ్యే రీతిలో చెప్పాలి. జీవితంలో పైస్థాయికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అవగాహన కల్పించాలి. – డాక్టర్ ఆకుల విశాల్, సైకాలజిస్ట్
పరీక్షలు రాసిన వారు 24,503
రెగ్యులర్ 24360
ప్రయివేట్ 143


