నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ధాన్యం సేకరణ ప్రక్రియ రైతన్నను ఆందోళనకు గురి

చేస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రాశులు పేరుకుపోగా, మరికొన్ని ప్రాంతాల్లో తూకం వేసి బస్తాల్లో నింపిన ధాన్యం తరలించడం లేదు. మాక్లూర్‌ మండలంలో సీజన్‌ ప్రారంభం నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా డొంకేశ్వర్‌, నవీపేట తదితర మండలాల్లో సమస్య ఉత్పన్నమవుతోంది. లారీలు, హమాలీల కొరత, రైస్‌మిల్లర్లు అన్‌లోడ్‌ చేసుకోకపోవడం కారణంగా చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు ఉండిపోయాయి. తాజాగా డీజిల్‌ కొరత పరిస్థితులు వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం తరలిస్తున్నారని లేదంటే నిరాకరిస్తున్నారని మోర్తాడ్‌ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తేనే పరిస్థితి చక్కబడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement