ధాన్యం కుప్పను ఢీకొన్న స్కూటీ.. యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కుప్పను ఢీకొన్న స్కూటీ.. యువతి మృతి

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

వర్ని: రోడ్డుపై వేసిన ధాన్యం కుప్పను స్కూటీ ఢీకొని యువ తి మృతి చెందింది. ఈ ఘటన మోస్రా మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వర్ని ఇన్‌చార్జి ఎస్సై భాస్కరాచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ నగరంలోని నామ్‌దేవ్‌వాడకు చెందిన అక్కాచెల్లెళ్లు దేవిరెడ్డి(17), మహారెడ్డి మోస్రాలోని బంధువుల ఇంటికి ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. సో మవారం రాత్రి తిరిగి నిజామాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో మోస్రా శివారులో రోడ్డుపై వేసిన ధాన్యకుప్పను స్కూటీ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికు లు వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించగా దేవిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దేవిరెడ్డి ఇంటర్మీడియెట్‌ విద్య పూర్తి చేయగా, మహారెడ్డి ప్రస్తుతం బీటెక్‌ చదువుతోంది. మృతురాలి తండ్రి జైపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

‘ఉపాధి’లో

అలసత్వం వద్దు

నిజామాబాద్‌ రూరల్‌: ఉపాధిహామీ పనుల్లో అలసత్వం తగదని డీఆర్డీవో సాయన్న అన్నారు. మండలంలోని మల్కాపూర్‌(తాళ్ల కొత్త పేట్‌) గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పనులు కొనసాగుతున్న చోట్ల కూలీల కు టెండ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం త్వరగా పని ప్రదేశానికి చేరుకుని తమకు కేటాయించిన పనిని పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోవాలని కూలీలకు సూచించారు. ఆయనవెంట ఎంపీడీవో రామ్‌నారాయణ, ఎంపీవో ఎక్బాల్‌, ఏపీవో పద్మ, సర్పంచ్‌ తదితరులున్నారు.

కాంగ్రెస్‌ భవన్‌ నిర్మాణానికి నేడు భూమిపూజ

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ భవన్‌ నిర్మాణ పనులకు ఇన్‌చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బుధవారం భూమి పూజ చేయనున్నా రు. రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలో కొన్నేళ్లుగా పార్టీ కార్యాలయం కొనసాగుతుండగా.. సమీపంలోనే నూతన భవనం నిర్మించనున్నారు. అలాగే మంత్రి సీతక్క న్యూ అంబేడ్కర్‌ భవన్‌, రాజీగాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో పా ల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్కపూర్‌(ఎం) తాళ్ల కొత్తపేట్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులను మంత్రి పరిశీలిస్తారని ఎంపీడీవో రామ్‌నారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement