చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాల ని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్‌ లీగ్‌ క్రీడల ముగింపు కా ర్యక్రమం నగరంలోని ఉమెన్స్‌ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుదర్శన్‌రెడ్డి హాజరై పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డితోకలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, టూరిజం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో రన్నింగ్‌, వాకింగ్‌ ట్రా క్‌ల నిర్మాణాలకు నిధు లు మంజూరు చేసినట్లు తెలిపారు. సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్‌, మేయర్‌ ఉమారాణి, నుడా చైర్మన్‌ కేశ వేణు, మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ ముప్పగంగారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు నగేశ్‌రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, ఎన్‌ఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కవితరెడ్డి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు రజనీకాంత్‌, శిరీష్‌, శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ ఉషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement