కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో విధులను నిర్లక్ష్యం వహిస్తే ఉ పేక్షించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశా రు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. భీమ్‌గల్ పట్టణంతోపాటు పల్లికొండలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. పల్లికొండలోని కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లను గుర్తించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుంచి కొనుగోలు కేంద్రాన్ని కేటాయించబోమని హెచ్చరించారు. విధుల్లో అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తూ భీమ్‌గల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని, ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. తరుగు, కోత వంటివి లేకుండా, రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చే యాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ముందస్తుగానే రైతులకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రక్ షీట్లను వెంటదివెంట తెప్పించుకుంటూ, ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సూచించారు. తద్వారా సకాలంలో రైతుల ఖాతాలలో బిల్లులు జమ అవుతాయన్నా రు. తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్‌కుమా ర్, ఎంపీడీవో సంతోష్‌కుమార్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిర్వహణలో నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
భీమ్‌గల్ ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం


