మాక్లూర్: వ్యక్తిగత కమీషన్లకు అలవాటు పడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు చేయకుండా ఆలస్యం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆలూర్ మండలం కల్లెడి గ్రామ రైతులు మాక్లూర్ సొసైటీ ప్రత్యేక అధికారి ఫిరోజ్‌ఖాన్, సీఈవో రతన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద అధికారులతో మంగళవారం వాగ్వాదానికి దిగారు. హమాలీల కొరత ఉందని, దానికి తామేమి చేయాలని అధికారులు సమాధానమివ్వడంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యానికి ప్రాధాన్యత ఇస్తూ లారీ వెనుక రూ.20వేల నుంచి రూ.30వేల లాభం పొందుతున్నారని ఆరోపిస్తూ అధికారులను కొద్దిసేపు గ్రామ పంచాయతీ స్టోర్ రూమ్‌లో నిర్బంధించారు. సమాచారం అందుకున్న ఎస్సై–2 మొగులయ్య గ్రామానికి చేరుకుని అధికారులను విడిపించారు. అనంతరం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను తరలించిన అధికారులు.. బుధవారం నుంచి రోజుకు రెండు లారీల్లో ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
మాక్లూర్ సొసైటీ
అధికారులతో వాగ్వాదం
జీపీ భవనంలో ఉంచి
తాళం వేసిన రైతులు
పోలీసుల జోక్యంతో బయటికి..
రోజుకు రెండు లారీలు
పంపుతామని అధికారుల హామీ


