ప్రతి పౌరుడు జనగణనలో భాగస్వామ్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి పౌరుడు జనగణనలో భాగస్వామ్యం కావాలి

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

ప్రతి పౌరుడు జనగణనలో భాగస్వామ్యం కావాలి

తెయూ(డిచ్‌పల్లి): ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించి జన గణనలో భాగస్వామ్యం కావా లని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ చక్రవర్తి పిలుపునిచ్చారు. తె యూ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘నో యువర్‌ నేషన్‌: అవేర్‌నెస్‌ ఆన్‌ సెన్సెస్‌ –2026’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. సరైన విధానాలు, సంక్షేమ పథకాలు రూ పొందించడంలో జనగణన డేటా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. టుటా అధ్యక్షుడు పున్నయ్య మాట్లాడుతూ.. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన లభిస్తుందన్నారు. పీఆర్‌వో రమణాచారి మాట్లాడుతూ.. ప్రజల్లో సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు స్వామి, శ్రీనివాస్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement