మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా

అంక్సాపూర్‌ జీపీ తీర్మానం

వేల్పూర్‌: మండలంలోని అంక్సాపూర్‌ గ్రామంలో 21 ఏళ్లలోపు వారికి మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ. 10వేల జరిమానా విధిస్తామని జీపీ పాలకవర్గం తీర్మానించింది. ఈమేరకు మంగళవారం దుకాణాల వద్ద పోస్టర్లు అతికించినట్లు సర్పంచ్‌ తీట్ల శ్రీనివాస్‌ తెలిపారు. జీపీ తీర్మానం ప్రకారం 21 ఏళ్లలోపు పిల్లలకు సిగరేట్లు, మత్తు పానీయాలు, పాన్‌ మసాలా, మద్యం విక్రయించరాదన్నారు. జీపీ తీర్మానాన్ని దిక్కరించిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement