ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

మాక్లూర్‌: మండలంలోని ధర్మోరా–మాందాపూ ర్‌ రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురె దురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్మోరా గ్రామానికి చెందిన సాయన్నల్ల ప్రసాద్‌ తన బైక్‌పై మంగళవారం రాత్రి ధర్మోరా నుంచి మాందాపూర్‌ వైపు బయలుదేరాడు. అదే గ్రా మానికి చెందిన టాకిన్‌ మల్లయ్య టీవీఎస్‌ ఎక్సెల్‌పై మాందాపూర్‌ నుంచి ధర్మోరా వైపు బయలుదేరాడు. వీరిద్దరి వా హనాలు గ్రామ శివారు లో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. మల్లయ్యకు స్వ ల్ప గాయాలు కాగా, ప్రసాద్‌కు బలమైన గాయాలు అయ్యాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం స్థానికులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement