‘ఇందిరమ్మ ఇళ్ల’పై నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ ఇళ్ల’పై నిర్లక్ష్యం వహించొద్దు

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

పనులు త్వరగా పూర్తయ్యేలా

లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి

అధికారులకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశం

కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లు,

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళ వారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై ఆమె సుదీర్ఘ స మీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొద టి విడతలో ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్‌ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకురాని వారి స్థానంలో అర్హులైన కొత్తవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని గడువు విధించారు.

సెల్ఫ్‌ స్టేజ్‌ క్యాప్చర్‌పై అవగాహన కల్పించాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో పారదర్శకతను పెంపొందించేందుకు ‘సెల్ఫ్‌ స్టేజ్‌ క్యాప్చర్‌ సిస్టమ్‌’ ను అమలు చేస్తోందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపా రు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మా ణ దశలను వారే స్వయంగా మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఫోటోలు తీసి, ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే అ వకాశం కల్పించబడిందని తెలిపారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిభారం ఉండదని, నిర్మాణ దశల ధ్రువీకరణ వేగవంతం అవుతుందని, నిధుల విడుదలలో అనవసర జాప్యం నివారించబడుతుందన్నారు. క్షే త్రస్థాయిలో లబ్ధిదారులకు ఈ విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

లాటరీ విధానంలో డబుల్‌ ఇళ్ల కేటాయింపు..

రెండు పడక గదుల ఇళ్ల స్థితిగతులను క్షేత్రస్థా యిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన చోట డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయింపు కోసం లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఖరారు చేయాలని, పార దర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూ చించారు. ఇదివరకు స్థలాలు పంపిణీ చేసి, ప్రొ సీడింగ్‌లు అందించిన వారికి ఎక్కడైనా పట్టా లు ఇవ్వకపోతే తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు పలుచోట్ల అటవీ సంబంధిత సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని తహసీల్దార్లకు మార్గనిర్దేశం చేశారు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ నుంచి నల్లమట్టి, చెరువుల నుండి పూడిక మట్టిని వ్యవసా య అవసరాల కోసం రైతులు ఉచితంగా తరలించుకునేలా అనుమతించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పక్కాగా పర్యవేక్షణ జరపా లన్నారు.సమావేశాల్లో అదనపు కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియ, ని జామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, హౌసింగ్‌ పీడీ గంగాధర్‌, ఏఈ నివర్తి మున్సిపల్‌ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, హౌసింగ్‌ ఏఈలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement