నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామ శివారు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల చిన్న గంగారం(60) అనే వృద్ధుడు మంగళవారం రాంపూర్ నుంచి లక్ష్మీకిసాన్‌ఫారం వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్న గంగారాంను స్థానికులు ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతుడి కుమారుడు వినీత్ ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డివైడర్‌ను బైక్ ఢీకొనడంతో రైతు..
నవీపేట: మండలంలోని అభంగపట్నం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన మూల వెంకట సుబ్బారెడ్డి (60) అనే రైతు మంగళ వారం వడ్ల లోడును లారీలో నిజామాబాద్‌కు తరలించగా, అతడు బైక్‌పై వెనకాల వెళ్లాడు. అభంగపట్నం గ్రామ సమీపంలో అతడి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


