తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో మొత్తం 7,118 మంది అభ్యర్థులకు గాను 6,816 మంది హాజరైనట్లు తెలిపారు. 302 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష కు 4,049 మందికి గాను 3,919 మంది హాజరు కాగా 130 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 3,069 మంది విద్యార్థులకు గాను 2,897 మంది హాజరు కాగా 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
కాలభైరవుడికి
108 రకాల స్వీట్లతో నైవేద్యం
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడిని వైశాఖ మాసం రెండోవ మంగళవారం సందర్భంగా 108 ర కాల స్వీట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి స్వామి వారికి జ లాభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారికి అర్చకులు 108 రకాల స్వీట్లతో అలంకరించి నైవేద్యం సమర్పించారు. స్వామికి అలంకరించే కరెన్సీ దండకు భక్తులు విరాళాలు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మూడో మంగళవారం 108 రకాల కూరగాయలతో స్వామివారికి నైవేద్యం సమర్పించనున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింతల శంకర్, ఈవో ప్రభుగుప్తా, అర్చకులు శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఉన్నారు.


