సిరికొండ: మండలంలోని రావుట్ల అటవీ ప్రాంతంలో విధులకు వెళ్లిన అ టవీ బీట్ అధికారి శ్రీకాంత్ బైకును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో నర్సింగరావు తెలిపారు. రావుట్ల బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నెంబర్ 395లో సోమవారం సెక్షన్ ఆఫీసర్ లచ్చయ్యతో కలిసి శ్రీ కాంత్ అటవీశాఖకు చెందిన బైక్‌పై గస్తీకి వెళ్లారు. ఒకచోట బైకును నిలిపి అటవీ ప్రాంతంలోకి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనం కాలిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా సిరికొండ ఎస్సై రామకృష్ణ వచ్చి బైక్‌ను పరిశీలించినట్లు ఎఫ్‌ఆర్‌వో తెలిపారు.
అగ్నిప్రమాదంలో గడ్డి, లాండ్రీ షాప్ దగ్ధం
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డి కట్టలు, లాండ్రీ షాప్ దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా.. గ్రామంలో గోవూరు మహిపాల్‌కు చెందిన 300 గడ్డి కట్టలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సిగరేట్ అంటించుకొని అగ్గిపుల్లను ఆర్పకుండ పడేయంతో గడ్డి కట్టలకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు వ్యాపించి పక్కనే ఉన్న చాకలి సంజీవ్ లాండ్రీ షాప్‌నకు వ్యాపించాయి. ప్రమాదంలో ఇసీ్త్ర దుకాణంలో ఉన్న దుస్తులు, ఇతర పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు.


