గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

దోమకొండ: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ యాదగిరిరావు అన్నారు. దోమకొండలో గడికోట ట్రస్టు, తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి డివిజన్‌కు చెందిన వివిధ గ్రామాల సర్పంచ్‌లకు గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ హాజరై, మాట్లాడారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో వసతుల కొరత వల్ల జరుగుతున్న వలసలను నివారించేందుకు సర్పంచులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలన్నారు. గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం సర్పంచులు సేకరించాలన్నారు.

ఈ తరహా అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరమని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. మహిళా సర్పంచులు మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం, గ్రామ అభివృద్ధి కోసం, ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామన్నారు. అనంతరం పాల్గొన్న సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు సన్మానంతోపాటు, సర్టిఫికెట్లను అందించారు. సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ సుధాకర్‌గౌడ్‌, నారాయణ గుప్తా, ఇంద్రకరణ్‌ రెడ్డి, ట్రస్ట్‌ చైర్మన్‌ బాబ్జి, శ్రీకాంత్‌ గౌడ్‌, కిషన్‌, కిరణ్‌ రాథోడ్‌, గంగా కిషన్‌, రాజేష్‌, రామలింగం, ప్రవీణ్‌, లైఫ్‌ ఎన్‌జీవో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బాల ప్రసాద్‌, దోమకొండ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement