గోవూరులో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గోవూరులో ఒకరి ఆత్మహత్య

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

వర్ని: మోస్రా మండలం గోవురు గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఇన్‌చార్జి ఎస్సై భాస్కరచారి తెలిపిన వివరాల ఇలా.. గ్రామానికి చెందిన సాయిలు(42) మూడు సంవత్సరాల క్రితం ట్రాక్టర్‌ కొన్నాడు. దీంతో అతడికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఆర్థిక ఇబ్బందులు భరించలేక మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

హొన్నాజీపేట్‌లో ఒకరు..

ధర్పల్లి: మండలంలోని హొన్నాజీపేట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని హొన్నాజీపేట్‌కు చెందిన బాసబోయిన నర్సయ్య (50) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన కూతురు పెళ్లికి అప్పులు చేశారు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన చెందేవాడు. ఈక్రమంలో మంగళవారం తన పొలం వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు.

లింగంపేట మండలంలో..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రా మంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపిన వి వరాలు ఇలా.. గ్రామానికి చెందిన శంకరయ్య(48) కొంత కాలంగా ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య సంతోషి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement