దోమకొండ: మండలంలోని సంఘమేశ్వర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కరికె రాజనర్సు(43) కుటుంబంలో కొన్నిరోజులుగా భూమి అమ్మిన డబ్బులు విషయంలో తగదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో సర్పంచ్ వద్ద గత ముడు రోజులుగా పంచాయితీ జరుగుంది. దీంతో అతడు మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
● మహిళకు గాయాలు
నిజామాబాద్ రూరల్: మోపాల్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆదివారం మంచిప్ప వైపు ఓ ఆటో వెళుతుండగా, మోపాల్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద హార్వెస్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మంచిప్పకు చెందిన పద్మకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హార్వెస్టర్ డ్రైవర్ ఇంద్రజిత్తుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత తెలిపారు.
లింగడంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి శివారులో విద్యుత్ షాక్‌తో హార్వెస్టర్ యజమాని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామానికి చెందిన నీరడి రవి(42)కి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అతడు కొన్నేళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో హార్వెస్టర్‌తో వరి పొలాల్లో కోతలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం అతడు శెట్పల్లిసంగారెడ్డి శివారులో వరి కోత యంత్రం బ్లేడ్లు ట్రాక్టర్ పైనుంచి కిందికి దించే క్రమంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌తో అతడు అక్కడే కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపా రు. అలాగే ట్రాన్స్‌కో ఏఈ హరీష్‌రావు సిబ్బందితో చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడు..
కామారెడ్డి అర్బన్/భిక్కనూరు: భిక్కనూర్ రైల్వే స్టే షన్ ప్లాట్‌ఫామ్‌పై ఆదివారం ఉదయం గుర్తుతెలి యని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై సాధు లింబాద్రి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. గద్వాల్ నుంచి సికింద్రాబాద్ వరకు రై లు టికెట్ ఉందన్నారు. మృతు డు తెల్లని గడ్డం, బట్టతల, గో ధుమ రంగు చొక్కా, బ్లూ కలర్ బనియన్, మెడలో రుద్రాక్షమాల, ఇతర పూసలతో కలిపి నాలుగు దండలున్నాయన్నారు. వయస్సు సుమారు 65 నుంచి 70 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తుపడితే 87126 58614 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
అనారోగ్యంతో హెడ్‌కానిస్టేబుల్..
ధర్పల్లి: ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. వివరాలు ఇలా.. నిజామాబాద్‌లో నివాసం ఉండే కారుపాక నర్సయ్య (52) ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నర్సయ్యకు గతంలో గుండెకు సంబంధించిన సర్జరీ జరిగింది. గత 20 రోజుల నుంచి ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి చనిపోయాడు. నగరంలోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సీఐ భిక్షపతి, ధర్పల్లి, సిరికొండ ఎస్సైలు వినయ్, రామకృష్ణ , పోలీస్ సిబ్బంది సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీలో ఆదివారం గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగలడంతో గడ్డి పూర్తిగా దగ్ధమైంది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రాక్టర్ ట్రాలీ సైతం పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు గోత్రాల గంగాధర్ తెలిపాడు.


