ఆర్మూర్‌టౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంఎల్‌బీ ఇండియా ఇన్‌చార్జి డేవిడ్ (అమెరికా) అన్నారు. ఆర్మూర్‌లోని జావిద్‌బాయ్ మినీస్టేడియంలో ఈనెల 23 నుంచి 26 వరకు ఎంఎల్‌బీ (మేజర్ లీగ్ బేస్‌బాల్) తెలంగాణ రీజనల్ అండర్–11 కప్ పోటీలు నిర్వహించారు. మొత్తం 22 టీంలు పోటీల్లో పాల్గొనగా, గ్రూప్–ఏలో తొర్లికొండ జెడ్పీహెచ్‌ఎస్ జట్టు ప్రథమ స్థానం, గ్రూప్–బీలో సిరికొండ సత్యశోధక్ పాఠశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచాయని డేవిడ్ అన్నారు. జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగే ఎంఎల్‌బి ఇండియా కప్ పోటీలలో రెండు జట్లు పాల్గొంటాయన్నారు. అనంతరం ఆయా జట్లకు ట్రోఫీలను అందజేశారు. తొర్లికొండ జట్టు కోచ్ మర్కంటి గంగా మోహన్, కిష్టాపురం సాయికుమార్, సత్యశోధక్ సిరికొండ జట్టు కోచ్ సంతోష్, దండు, ఎంఎల్‌బీ సంకీర్త్ శెట్టి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 30న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రవిఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీ ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళా జరుగుతుందన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్‌టీ, ఫార్మాటెక్ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు (బాలురు) జాబ్‌మేళాకు అర్హులని తెలిపారు. ఇందులో ఎంపికై న విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ప్రఖ్యాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కంపెనీ నిధులతో స్పాన్సర్ చేయబడే బీఎస్సీ డిగ్రీ విద్య కోసం ఉచితంగా కళాశాలలో చేర్పిస్తారని తెలిపారు. ఉద్యోగ సమయంలో ఉచిత హాస్టల్ వసతి, కంపెనీకి వెళ్లేందుకు హాస్టల్ నుంచి బస్ వసతి సౌకర్యం ఉంటుందన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. జాబ్‌మేళాను డిచ్‌పల్లి పరిసర ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల ని ఆయన కోరారు.
రుద్రూర్: పోతంగల్ శివారులో విక్రయించేందుకు ఉంచిన ధాన్యం బస్తాలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దగ్ధమైంది. పోతంగల్ శివారులోని పొలాల్లో వరి కొయ్యలకు ఆదివారం నిప్పు పెట్టగా, మంటలు వ్యాపించి బస్తాల్లో నింపిన ధాన్యంకు అంటుకున్నాయి. ఈ ఘటనలో పాత పోతంగల్‌లోని శంకర్ అనే రైతుకు చెందిన సుమారు 50 బస్తాల్లో ఉన్న ధాన్యం స్వల్పంగా దెబ్బతిన్నట్టు స్థానికులు తెలిపారు. ఎలాంటి అంక్షలు లేకుండా కాలిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోగొట్టుకున్న
ఫోన్ల అప్పగింత
రుద్రూర్: కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోన్ లు పోగొట్టుకున్న బాధితులకు ఆదివారం ఫో న్‌లను ఎస్సై సునీల్ తిరిగి అప్పగించారు. పో తంగల్ మండలం కల్లూర్‌కు చెందిన ప్రకాష్, పోతంగల్‌కు చెందిన యూసుఫ్, కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి, కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డి, కోటగిరికి చెందిన బుజ్జన్నకు ఫోన్లను అందజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి ఫోన్లను రికవరీ చేశామని, ఇందులో రెండు ఫోన్‌లను బిహార్, హైదరాబాద్‌లో రికవరి చేసినట్టు ఎస్సై సునీల్ తెలిపారు.
బాన్సువాడ : బీర్కూర్ సహకార సంఘం పరిధిలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో గ న్నీ సంచుల కొరతతో శనివారం రాత్రి సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూ ర్, కిష్టాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోలు చేయడం లే దు. దీంతో ఆగ్రహించిన రైతులు సహకార సంఘం సిబ్బందిని నిలదీశారు. సహకార సంఘం కార్యదర్శి విఠల్ సెలవులో ఉండడంతో సిబ్బంది సంచుల కొరతపై దృష్టి సారించడం లేదని రైతులు మండిపడ్డారు. అధికారులు స్పందించి సహకార సంఘానికి 20 వేల గన్నీ సంచులను తెప్పించాలని కోరారు. గన్నీ సంచులు తెప్పించకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.


