రెంజల్(బోధన్): చిన్ననాటి మిత్రులందరూ దా దాపు 45ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రెంజల్ జి ల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980– 81 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆదివారం ‘పూ ర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించా రు. ఏళ్ల తర్వాత వారంతా మళ్లీ ఒక్కచోట కలు సుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరిస్తూ చిన్ననాటి తీపిగుర్తులను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు.
వేల్పూర్‌లో 40 ఏళ్ల తర్వాత..
వేల్పూర్: వేల్పూర్ హైస్కూల్‌లో చదువుకున్న 1985–86 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆదివా రం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ విద్యార్థులంతా ఒకచోట కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు.


