ఘనంగా కన్యకా పరమేశ్వరీ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కన్యకా పరమేశ్వరీ జయంతి

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని కిసాన్‌గంజ్‌లోగల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో అమ్మవారి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ నామకరణం చేశారు. అంతకుముందు పెద్ద బజారులోగల నగరేశ్వర ఆలయం వద్ద ఎమ్మెల్యే ధన్‌పాల్‌ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శివాజీ నగర్‌ పెద్ద బజార్‌ గాంధీచౌక్‌ మీదుగా కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఒగ్గు కళాకారులు, పులి వేషాలు, బోనాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. అనంతరం ఆలయంలో అమ్మవారికి ఆభరణాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందుంటారన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు పాల్తే రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, కోశాధికారి మామిడి శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు ధన్‌పాల్‌ శ్రీనివాస్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement