నగరంలోని పద్మనగర్ రోడ్డులోగల లోలెవల్ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణగా ఉండాల్సిన పోల్స్ విరిగిపోయాయి. దీంతో వంతెనపై వెళ్లే వాహనాలు అదుపుతప్పితే నీటిలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే వంతెన రహదారి సైతం గుంతలు ఏర్పడి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


