రుద్రూర్: మండలంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రాంగణంలోగల పద్మావతి –వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో పరిశోధన కేంద్రం నుంచి ఆలయం వరకు భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా కల్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పిట్ల కృష్ణ మహరాజ్ హాజరై భక్తులకు ప్రవచనాలు చేశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి పవన్ చంద్రరెడ్డి, రిటైర్ట్ హెడ్ మాస్టర్, లయన్స్ సీనియర్ సభ్యులు పీవీ సుబ్బారావ్, సర్పంచ్ రాంబాబు, మాజీ సర్పంచ్ గంగామణి, రాజా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


