సాహిత్య బడి కృషి అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

సాహిత్య బడి కృషి అభినందనీయం

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

తెలంగాణ రచయితల సంఘం

రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాలోని కవులందరినీ స మీకరించుకొని, వర్తమాన కవులకు మంచి మార్గద ర్శనం చేసేలా ఏర్పాటైన ‘సాహిత్య బడి – ఇందూ రు జిల్లా’ కృషి అభినందనీయమని ప్రముఖ క వి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నా ళేశ్వరం శంకరం పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందూరు యువత కార్యాలయంలో ఆదివారం జి ల్లాస్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాళేశ్వరం శంక రం మాట్లాడుతూ.. కవిత్వం నిరంతర తపస్సుతో సాధించాల్సిన వరమని, దానికి అధ్యయనం, అ భ్యాసం రెండు కళ్లని అన్నారు. పదునెక్కిన అక్షరాలే ఎదను తాకే కవితలుగా నిలుస్తాయని పేర్కొన్నా రు. అనంతరం ఇందూరు బడి నిర్వాహకులు డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు, డాక్టర్‌ మద్దుకూరి సాయిబాబు ను అభినందించారు. కార్యక్రమంలో బైస దేవదా సు, కవులు దారం గంగాధర్‌, రజిత, నాగం సాయి లు, స్వప్న, సోనీ, రాజ్‌కుమార్‌, సిర్ప లింగం, శంకర్‌ గౌడ్‌, స్వర్ణ సమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement