భగ్గుమంటున్న భానుడు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న భానుడు

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

మరోసారి రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మెండోరాలో 44.4 డిగ్రీలు

నిజామాబాద్‌అర్బన్‌: భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోనే జిల్లాలో మరోసారి ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరాలో అత్యధికంగా 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదే నెలలో ఆలూరు మండలం మచ్చర్లతోపాటు భీమ్‌గల్‌, నిజామాబాద్‌ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలులు వీస్తుండడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement