ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌అర్బన్‌: వాసవీ మాత కన్యకాపరమేశ్వరి జయంతిని ఆదివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయాగౌడ్‌ వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్‌, వాసవి క్లబ్‌ ప్రతినిధులు, వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

పరీక్ష ఫీజు గడువు పెంపు

ఖలీల్‌వాడి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్ష ఫీజును చెల్లించేందుకు రూ.500 అపరాధ రునుముతో గ డువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి రామ్మోహన్‌రెడ్డి, కో ఆర్డినేటర్‌ కె రంజిత ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. అ లాగే పీజీ, ఎంబీఏ సె మిస్టర్‌ విద్యార్థుల్లో అసైన్‌మెంట్‌ సబ్మిట్‌ చేయని వారుంటే ఆ న్‌లైన్‌లో నుంచి ప్రశ్నా పత్రం డౌన్‌లోడ్‌ చేసుకుని, అసైన్‌ మెంట్‌ సబ్మిట్‌ చేయాలని సూ చించారు. ఇతర వివరాలకు యూనివర్సిటీకి సంబంధించిన వెబ్‌సైట్‌ www.braou online.inను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఖలీల్‌వాడి: టీటీసీ (టెక్నికల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌) కోర్సుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోర్సు డైరెక్టర్‌ సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత చెంది, తత్సమాన ట్రేడ్‌లో లోయర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. డ్రాయింగ్‌, టైలరింగ్‌, సంగీతం ఈ మూడు కోర్సులలో 42 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మే 1 నుంచి జూన్‌ 12 వరకు కోటగల్లీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణకేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదిలాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల అభ్యర్థలకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఆసక్తిగలవా రు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని డీఈవో కార్యాలయంలో సమ ర్పించాలన్నారు.

నేడు సబ్‌ కలెక్టర్‌ రిలీవ్‌

వికాస్‌ మహతోకు వీడ్కోలు

పలకనున్న అధికారులు

సంక్షేమ పథకాల అమలు,

అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర

బోధన్‌: బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహ తో సోమవారం రిలీవ్‌ అవ్వనున్నారు. ఆయ న జీహెచ్‌ఎంసీ జోన ల్‌ కమిషనర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. 2022 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మహతో 5 సెప్టెంబర్‌ 2024న బోధన్‌ సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అన్ని శాఖల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూనే పనుల్లో పరుగులు పెట్టించారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సజావుగా పూర్తి చేయటంతో ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.

కార్యాలయానికి వచ్చి ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా ఆలకించి పరిష్కారానికి కృషి చేశారనే ప్రత్యేక గుర్తింపు పొందారు. బదిలీ సందర్భాన్ని పురస్కరించుకొని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్‌లో వీడ్కోలు, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement