ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

‘మున్సిపోల్స్‌’లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

ఉత్తర్వులు జారీ చేసిన

డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి

ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణ కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. కోవర్టులకు చెక్‌ పెడుతూ అధిష్టానం కఠిన చర్యలకు పూనుకుంది. ఇటీవల నిర్వహించిన ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీకి నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఏబీ శ్రీదేవి (చిన్న) ఓటమికి విప క్ష పార్టీలతో కలిసి పనిచేసిన ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసం విపక్షాలతో చేతులు కలిపి కోవర్టు రాజకీయం చేరనే ఆరోపణలతో కాంగ్రెస్‌ నాయకులు ఇమామొద్దీన్‌(అజ్జు), ఫయాజ్‌లపై పార్టీ అధిష్టానం సీరియస్‌ అ యింది. కాంగ్రెస్‌ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు సా యిబాబాగౌడ్‌ ఫిర్యాదు మేరకు ఈ నెల 16న షో కాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో ఇద్దరి నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇమామొద్దీన్‌ (అజ్జు) కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కా గా, ఫయాజ్‌ వదిన గత పాలకవర్గంలో కౌన్సిలర్‌గా విజయం సాధించగా పట్టణంలో ఫయాజ్‌ కౌన్సిలర్‌గా చలామణి అయ్యాడు. ఆర్మూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గంలో డైరెక్టర్‌గా సైతం ఫయాజ్‌ను నామినేట్‌ చేశారు. తాజాగా వీరి సస్పెన్షన్‌తో పట్టణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.

కోవర్ట్‌, రెబల్స్‌ గుండెల్లో గుబులు..

ఇద్దరు కాంగ్రెస్‌ నాయకుల సస్పెన్షన్‌తో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసి న రెబల్‌ అభ్యర్థులపై సైతం చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్‌ నాయకులు త మ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ జంబి హనుమాన్‌ ఆలయ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న రేగుళ్ల సత్యనారాయణ 27వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా తన సతీమణిని పోటీకి నిలిపాడు. పట్టణంలోని 1, 3, 13, 14, 18, 19, 20, 27, 30 తదితర వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఓటమిలో రెబల్స్‌తోపాటు కోవర్టులు కీలకపాత్ర పోషించారు. దీంతో వీరందరిపై ఫిర్యాదులు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement