రోడ్డెక్కిన ప్రగతి రథాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన ప్రగతి రథాలు

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

చర్చలు సఫలం కావడంతో

ఆర్టీసీ కార్మికుల సంబురాలు

పూర్తిస్థాయిలో తిరిగిన బస్సులు

నిజామాబాద్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు సఫలం కావడంతో డిపో నుంచి బస్సులు కదిలాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో శనివారం ఉద యం ఆర్టీసీ కార్మికులు సంబురాలు నిర్వహించారు. డిపోల వద్ద పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ముందుకొచ్చిన ప్రభుత్వానికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విధుల్లో చేరారు. నిజామాబాద్‌–1, 2తో పాటు ఆర్మూర్‌, బోధన్‌ డిపోల పరిధిలోని మొత్తం 650 బస్సులు నడిచాయని ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న వెల్లడించారు. ఆర్టీసీ డిపో–1 వద్ద కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి కార్మికులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement