దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

జిల్లా కేంద్రంలో ప్రపంచ మలేరియా డే అవగాహన ర్యాలీ

సుభాష్‌నగర్‌ : దోమల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా డే సందర్భంగా శనివారం కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వినాయక్‌నగర్‌ పీహెచ్‌సీ పరిధిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటితోపాటు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రత పాటించాలన్నారు. కిటికీలు, తలుపులకు దోమ తెరలు వాడాలని, ఐదేళ్లలో మలేరియా కేసులు నమోదు కాలేవని, కానీ దోమల ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. డెంగీ వంటి కేసులు కూడా నమోదు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు గృహ సందర్శనలో జ్వర సర్వేను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్‌ నాయక్‌, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీలత, ఏఎంవో సలీం, డీహెచ్‌ఈ ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు, సబ్‌ యూనిట్‌ అధికారులు, హెచ్‌ఈవోలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement