ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

సమస్యలన్నింటిని పరిష్కరిస్తుంది

డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేవిధంగా కృషి చేస్తోందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ప్రభుత్వంతో ఆర్టీసీ నేతల చర్చలు సఫలం కావడంతో శనివారం వారు నగరంలోని డిపో–1 వద్దకు వెళ్లి, కార్మికులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ యూనియన్‌లను తీసివేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం యూనియన్లను ప్రవేశపెడుతున్నదన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. ఇవేగాక ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 30 వరకు ఆమోదం తెలుపుతూ ప్రజాప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం..

ఆర్టీసీ కార్మికులతో చర్యలు సఫలం కావడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో కోట్ల బకాయిలను గణనీయంగా తగ్గించి ఆర్టీసీ సంస్థను పునరుద్ధరించిందన్నారు. రాష్ట్రం గతంతో పోలిస్తే ప్రస్తుత అభివృద్ధి దిశగా గణనీయమైన మలుపు తీసుకుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement