● నేటినుంచి చౌట్‌పల్లి ఆలయ
బ్రహ్మోత్సవాలు
● వారం రోజులపాటు
కొనసాగనున్న వేడుకలు
మోర్తాడ్(బాల్కొండ) : చారిత్రక నేపథ్యమున్న క మ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లిలోగల లక్ష్మీనా రాయణస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలుస్తోంది. ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, వారంపాటు కొన సాగనున్నాయి. ద్రావిడ సాంప్రదాయం ప్రకారం ఆరాధనోత్సవాలు వారం రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు చౌట్‌పల్లి గ్రామాభివృద్ధి క మిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాల్లో భా గంగా 28న స్వామివారి కల్యాణోత్సవం, 1న రథోత్సవం నిర్వహించనున్నారు. వేడుకల్లో చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు భారీగా హాజరుకానున్నారు.
చారిత్రక నేపథ్యం..
పూర్వ కాలంలో సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహాముని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో శ్రీమహావిష్ణువును కీర్తిస్తూ కఠోరమైన తపస్సు చే యగా ఆయనకు సాక్షాత్కారమిచ్చిన ఆ దేవదేవుడు కలియుగంలో భక్తులను ఉద్దరించడానికి మూడు చోట్ల శ్రీలక్ష్మి నారాయణ స్వామి ఆలయాలను ని ర్మించాలని ఆదేశించారని చరిత్ర చెబుతోంది. దేవ దేవుని ఆదేశాల మేరకు అగస్త్య మహాముని జైనపు రి (ఆదిలాబాద్ జిల్లాలో ని జైనథ్), లక్ష్మిపురి( చౌట్‌పల్లి), మహాపురి(పెద్దపల్లి జిల్లాలోని మంథని)ల లో ఆలయాలను నిర్మించారని శిలాశాసనాల ద్వా రా వెల్లడైంది. లక్ష్మిపురి(చౌట్‌పల్లి) ఆలయ నిర్మాణంను 1279లో మాఘశుద్ధ దశమి శుక్రవారం రో హిణి నక్షత్ర శుభ ముహుర్తంలో ప్రారంభించి అనతికాలంలోనే పూర్తి చేసినట్లు తెలంగాణ దేవాలయా ల పరిశోధకులు హరిదాసు గతంలో వెల్లడించారు. కాకతీయుల రాజ్యం అంతమైన తరువాత గ్రామంలోని ఏలేటి, కేతిరెడ్డి వంశస్తుల సహకారంతో ని త్యం రెండు పూటలా పూజాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎంతో మంది జీయర్ స్వాములు స్వామిని దర్శించుకుని తమ పూర్వీకులు ఈ ఆలయం గురించి చెప్పిన గొప్ప విషయాలను భక్తులకు వివరించారు. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి జాతరను నిర్వహిస్తారు.
గొప్పగా నిర్వహిస్తాం..
ఎంతో మంది భక్తులకు కొంగుబంగారంగా శ్రీలక్ష్మీనారాయణ స్వామి నిలిచా రు. తాము కోరుకున్న కోరి కలను తీర్చే దేవదేవుడిగా స్వామివారు కీర్తించబడుతున్నారు. ఆలయ ఉత్సవాలను ఎంతో ఘనంగా ప్రతి ఏటా నిర్వహస్తున్నాం. ఏలేటి, కేతిరెడ్డి వంశీయు లు, గ్రామస్తుల సహకారంతో ఈసారి కూడా ఉత్సవాలను గొప్పగా నిర్వహిస్తాం.
– సముద్రాల అమరనాథచార్యులు,
ఆలయ ప్రధాన అర్చకులు, చౌట్‌పల్లి


