దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

దరఖాస్తుల ఆహ్వానం కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి చెక్కు పంపిణీ

బోధన్‌: బోధన్‌లోని కేంద్రియ విద్యాలయంలో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న 4 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్స్‌ ఇన్‌చార్జి అమోల్‌ సరోడే ఒక ప్రకటనలో తెలిపారు. ఆడ్మిషన్‌ ఫారాలు విద్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, అర్హత, ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈనెల 27లోపు నేరుగా విద్యాలయానికి వచ్చి, దరఖాస్తులు అందించాలని సూచించారు.

స్కౌట్‌ మాస్టర్ల పోస్టుల భర్తీకి..

నిజామాబాద్‌అర్బన్‌: ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా ది స్కౌట్‌ గైడ్స్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేసేందుకు స్కౌట్‌ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ది స్కౌట్‌ గైడ్స్‌ ఆర్గనైజేషన్‌ కమిషనర్‌ జాడి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 2లోపు విద్యుత్‌నగర్‌లోని ఉమ్మడి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలని, వయస్సు 18ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు, వేతనం నెలకు రూ.15వేల వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 96526 95670ను సంప్రదించాలన్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకు చెందిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌ గత ఏడాది నేరస్థుడి చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో అతడి పిల్లల చదువుల నిమిత్తం టెర్మినాస్‌ గ్రూప్‌ సీఎండీ ఎస్‌పి రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈమేరకు చెక్కును శనివారం రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్‌ఎల్‌ఎన్‌ రెడ్డి గతంలో బోధన్‌లో డీఎస్పీగా సేవలందించారు. సీపీ సాయి చైతన్య తదితరులు ఉన్నారు.

డీఎస్పీ శ్రీశైలంకు అభినందన

నిజామాబాద్‌అర్బన్‌: ఎస్‌బిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీశైలం డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈసందర్భంగా ఆయన శనివారం సీపీ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీశైలంను సీపీ అభినందించారు.

నల్లమట్టి వాహనాలకు

జరిమానా

నందిపేట్‌(ఆర్మూర్‌): రైతుల పేరిట గోదావరి పరివాహాక ప్రాంతం నుంచి అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్న 9 వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం గోదావరి నది నుంచి అక్రమంగా నల్లమట్టిని అధిక లోడుతో టిప్పర్లలో నింపుతూ నందిపేట మండలం మీదుగా వెళుతుండగా రెవెన్యూ అధికారులు 9 వాహనాలను పట్టుకున్నారు. ఒక్కొ వాహనానికి రూ. 15వేలతో రూ.లక్ష 35 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement