ఆడుకుంటుండగా బాలుడి మెడకు చుట్టుకున్న ప్లాస్టిక్‌ లాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆడుకుంటుండగా బాలుడి మెడకు చుట్టుకున్న ప్లాస్టిక్‌ లాక్‌

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

గమనించి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

వైద్యులు లాక్‌ను తొలగించడంతో

తప్పిన ప్రమాదం

పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్న

బాలుడి కుటుంబీకులు

బాలుడి మెడకు చుట్టుకున్న ప్లాస్టిక్‌ లాక్‌

పిట్లం(జుక్కల్‌): ఓ బాలుడు ఆడుకుంటుండగా మెడకు ప్లాస్టిక్‌ లాక్‌ చుట్టుకోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడగా, పోలీసులు ఆస్పత్రికి తరలించి కాపాడారు. వివరాలు ఇలా.. పిట్లంలోని జాతీయ రహదారి 161 పక్కన గల సర్వీస్‌ రోడ్డుపై శనివారం పలువురు చిన్నారులు ఆడుకుంటున్నారు. వారిలో కార్తీక్‌ అనే నాలుగేళ్ల బాలుడు ప్లాస్టిక్‌ లాక్‌తో ఆడుతుండగా, అతడి మెడకు లాక్‌ అయింది. దీంతో అతడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడగా, అటుగా వెళ్తున్న పోలీసులు గమనించారు. వెంటనే తమ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు బాలుడి మెడకు ఉన్న లాక్‌ను తొలగించడంతో ప్రాణాపాయం తప్పినట్టయింది. సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్సై రాచప్ప, శైలేష్‌ చారి, యశ్వంత్‌, ప్రియాంక, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement