రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

మోర్తాడ్‌: మండలంలోని పాలెం–తిమ్మపూర్‌ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఎనుగంటి గంగారాం(63) అనే వ్యక్తి శనివారం తిమ్మాపూర్‌ నుంచి పాలెంకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో అతడి వా హనాన్ని ఓ లారీ రివర్స్‌లో వస్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగారాం తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే మృతిచెందా డు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరు కొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళా..

జక్రాన్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా.. మండలంలోని బాలానగర్‌కు చెందిన శివరాత్రి లక్ష్మీ (35)అనే మహిళ ఈనెల 23న భర్త లక్ష్మణ్‌తో కలిసి బైక్‌పై ఆర్మూర్‌కు బయలుదేరారు. సికింద్రాపూర్‌ గ్రామం వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై వడ్ల చిన్నమ్మ అనే వ్యక్తి వడ్లను ఆరబెట్టాడు. దంపతుల బైక్‌ వడ్ల కుప్పలపైకి వెళ్లడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement