తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థుల డిబార్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. శనివారం జరిగిన పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో 7,487 మంది విద్యార్థులకు గానూ 7,200 మంది హాజరు కాగా 287 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు
డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 26 మంది విద్యార్థులకు గానూ 26 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.


