● ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ
● 13 మంది ప్రయాణికులకు గాయాలు
జక్రాన్‌పల్లి : జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆర్టీసీ అద్దె బస్సును లారీ ఢీకొనడంతో 13 మందికి గాయాలు అయ్యా యి. కామారెడ్డి నుంచి 20 మందితో ఆర్మూర్‌కు బస్సు బయలుదేరింది. అర్గుల్ వద్ద నలుగురు దిగుతుండగా ఆగి ఉన్న బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్గుల్‌కు చెందిన తెడ్డు లక్ష్మి, లోహిత, సుకన్య, ప్రియాంశీ, బస్సులోని తొమ్మిది మంది గాయపడ్డారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను స్థానికులు బ యటకు తీశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. బస్సు డ్రైవర్ అరుణ్, కండక్టర్ అనితకు స్వల్ప గా యాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడేళ్ల ప్రియాంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.
అర్గుల్‌లో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీ సాయిచైతన్య గాయపడిన సుకన్య


