జూనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

నిర్మాణ రంగ కార్మికుల పిల్లలకు విదేశాల్లో ఉపాధి

నిజామాబాద్‌ లీగల్‌: జిల్లా కోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జీలుగా విధులు నిర్వహిస్తున్న ఖుష్భూ ఉపాధ్యాయ, కుమారం గోపీకృష్ణ ను హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర హైకో ర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లుగా వీరు నిజామాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నా రు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మొత్తం 49 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీలు జరుగగా, అందులో భాగంగా ఖుష్భూ ఉపా ధ్యాయ, గోపీకృష్ణను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (విజిలెన్స్‌) ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జడ్జీ గోపీకృష్ణను సీనియర్‌ న్యాయవాదులు జక్కుల వెంకటేశ్వర్‌, ఆర్‌ఎస్‌ఎల్‌ గౌడ్‌, నరేందర్‌ రెడ్డి, కిషన్‌ రావు దేశ్‌ముఖ్‌, సంతోష్‌ నిర్మల్కర్‌, శ్యామ్‌బాబు, వేణు తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

కొనసాగుతున్న

‘ఓపెన్‌’ పరీక్షలు

ఖలీల్‌వాడి: జిల్లాలో ఓపెన్‌ పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు నాలుగవ రోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఈవో అశోక్‌ తెలిపారు. 12 కేంద్రాల్లో జరుగుతున్న ఎస్సెస్సీ పరీక్షల్లో 2481 మందికి 2196 మంది హాజరైనట్లు తెలిపారు. అలాగే 15 కేంద్రాల్లో కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షల్లో 1756 మందికి 1585 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను మూడు ఫ్లయింగ్‌ స్వ్కాడ్స్‌ తనిఖీలు చేసినట్లు చెప్పారు.

ఎంఈడీ మొదటి సెమిస్టర్‌

పరీక్షలు ప్రారంభం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. నిజామాబాద్‌ జీజీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 26 మంది విద్యార్థులకుగానూ 26 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.

నిజామాబాద్‌ రూరల్‌: నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా లేబర్‌ డిప్యూటీ కమిషనర్‌ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారిని గుర్తించేందుకు ఏసీఎల్‌, ఏఎల్‌వోల ద్వారా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యే క కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొ న్నారు. కార్మిక శాఖలో వివరాలు నమోదు చేసుకున్న కార్మికుల పిల్లల్లో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. భాష, సాఫ్ట్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణను ఇచ్చి విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement