● రాంపూర్ వృద్ధాశ్రమాన్ని
సందర్శించిన డీఎంహెచ్‌వో
● వైద్య శిబిరం నిర్వహణ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్ర తి ఉదయం చేతనైన వ్యాయామం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ని వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. వృద్ధులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెనూ ప్రకా రం వంటలు చేయాలని సిబ్బందికి సూచించారు. తీవ్ర ఎండల దృష్ట్యా చల్లదనం కోసం వృద్ధాశ్రమంలో కూలర్ సదుపాయం కల్పించాలన్నారు. అనంతరం ఇందల్వాయి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రాజెక్టు అధికారి వెంకన్న, డిప్యూ టీ డీఎంహెచ్‌వో సికిందర్ నాయక్, వైద్య నిపుణు లు చైతన్య, రవితేజ, స్నేహ, ఫణీంద్ర, స్థానిక వైద్యాధికారి షారోన్ షైనీ క్రిష్టినా, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


